చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.tv15news
బాక్సింగ్, హెప్టాథ్లాన్ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు @Nikhat_Zareen, @AgasaraNandini ఈరోజు జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇద్దరు బిడ్డలు తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సీఎం కొనియాడారు.
రాష్ట్ర క్రీడాకారులు తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని మరోమారు చాటారని సీఎం కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డలు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించి తెలంగాణకే కాకుండా దేశానికే వన్నె తేవడం సంతోషంగా వుందని సీఎం అన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.